![]() |
![]() |
.webp)
సదా తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో కొన్ని టిప్స్ ఇచ్చింది. పిల్లలు పుట్టాక ఒకవేళ భార్య,భర్తలు విడిపోతే వారి పరిస్థితి ఏంటి? అందుకే ఓ మెచురిటీతో ఉండాలి. విడిపోవాలనుకునేవారు పెళ్ళి ఎందుకు చేసుకోవడం. భారంగా ఉంటే పిల్లల్ని ఎందుకు కనడం అంటూ సదా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సదా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'జయం' మూవీని చెప్పొచ్చు. జయం సినిమా వచ్చి దాదాపు 20 సంవత్సరాలు దాటినా అప్పటికి ఇప్పటికి తరగని అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది సదా. ఆ తర్వాత వచ్చిన అపరిచితుడు, ప్రియసఖి, సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలని చేసింది. ఎప్పుడు గ్రీనరిని కోరుకునే సదా.. 'సదాస్ గ్రీన్ లైఫ్' పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అయితే రీసెంట్ గా సదా తన సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టింది. పలు టీవి షోస్ లో జడ్జి గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిబి జోడీ షోతో నిన్న మొన్నటివరకు బిజీగా ఉన్న సదా.. ఇప్పుడు ఢీ షోతో ఇంకా బిజీ అయింది.
తాజాగా ఢీ షోలో శేఖర్ మాస్టర్ తో కలిసి సదా చేసిన డ్యాన్స్ మంచి వీక్షకాదరణ పొందింది. అయితే శేఖర్ మాస్టర్, సదా కాంబినేషన్ జడ్జిమెంట్ అంటే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్.. అయితే సదా తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఇలా తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తూ.. అందరికి దగ్గరగా ఉంటూ వస్తుంది. తన యూట్యూబ్ లోని ఓ వ్లాగ్ లో తన పెళ్ళి గురించి పిల్లల గురించి క్లారిటీ ఇచ్చింది సదా.. రేపు నాకు పెళ్ళి జరిగితే నేను ఎలా ఉండాలో అతనే డిసైడ్ చేస్తే, నాకు నచ్చినట్టుగా నేను ఉండలేకపోతే ఎలా.. ఒకవేళ మాకు పిల్లలు పుడితే మేమిద్దరం విడిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారంటూ కామెంట్స్ చేసింది. దీంతో పలువురు విమర్శకులు ఇది సరికాదు కదా ఎన్నిరోజులు ఇలా ఒంటరిగా ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |